Anushka Shetty: అందుకే ఆ హీరో అంటే చెప్పలేనంత అభిమానం

by Pulgam srinivas |

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున గారు అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని అనుష్క శెట్టి చెప్పుకొచ్చింది.

Anushka Shetty: అందుకే ఆ హీరో అంటే చెప్పలేనంత అభిమానం
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్‌ను సంపాదించుకున్న హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. ఈమె నాగార్జున హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఈ మూవీలో ఈ నటి తన అందంతో, నటనతో ఆకట్టుకోవడంతో ఈ చిత్రం తర్వాత ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దాంతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా అనేక తమిళ చిత్రాల్లో కూడా నటించి అక్కడ కూడా తిరుగులేని నటిగా కెరీర్‌ను ముందుకు సాగించింది.

ఇంత గొప్ప స్థాయిలో సినీ ప్రస్థానాన్ని కొనసాగించిన ఈమె తనకు ఒక హీరో అంటే చెప్పలేనంత అభిమానం ఉందని, ఎందుకు ఆయనంటే అంత అభిమానం అనే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో క్లియర్‌గా వివరించింది. అనుష్క మాట్లాడుతూ: “నేను పూరి జగన్నాథ్ గారి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాను. నాకు మొదట్లో నటనపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ పూరి జగన్నాథ్ గారు నన్ను ‘సూపర్’ సినిమాలో తీసుకోవాలని అనుకున్నారు. హీరోయిన్ కావాలనుకునేవారు ఫోటోషూట్లు చేస్తారు అనే విషయం కూడా నాకు తెలియదు.

ఆయన ఒక రోజు ఫోటో ఇవ్వండి అని అడగడంతో నేను పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చాను. దానికి ఆయన నవ్వుకుని లైట్‌గా తీసుకున్నారు. ఇక నా మొదటి సినిమా విషయంలో నాగార్జున గారి నుండి చాలా సపోర్ట్ లభించింది. నేను ఇండస్ట్రీకి కొత్త, నటన కూడా రాదు. ఆయన ఎంతో గొప్ప సీనియర్ నటుడు అయినప్పటికీ నన్ను అర్థం చేసుకున్నారు. ఆయన అంతలా సపోర్ట్ చేసి ఉండకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. అందుకే నాగార్జున గారు అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది,” అని అనుష్క చెప్పుకొచ్చింది. నాగార్జున – అనుష్క శెట్టి కాంబినేషన్‌లో అనేక చిత్రాలు వచ్చాయి. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి అనేక సందర్భాల్లో మంచి ప్రశంసలు లభించాయి.

Next Story