- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖైదీ2లో 40 ఏళ్ళ టాలీవుడ్ హీరోయిన్?
టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ పెళ్లి కాకుండాన

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు పదుల వయసు వచ్చినప్పటికీ పెళ్లి కాకుండానే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది అనుష్క శెట్టి. బాహుబలి లాంటి పెద్ద సినిమాలు చేసిన తర్వాత అనుష్క శెట్టి ఖాతాలో పెద్ద సినిమా రాలేదు.
చిన్న చిన్న సినిమాలు మాత్రమే చేస్తూ ముందుకు సాగుతోంది అనుష్క. అయితే ఇలాంటి నేపథ్యంలో అనుష్క శెట్టికి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు చెబుతున్నారు. ఆమెకు ఖైదీ పార్ట్ 2 లో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లు సమాచారం అందుతాయి. ఖైదీ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో కార్తీ హీరోగా చేశాడు.
అతి త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2 కూడా రాబోతుంది. అయితే ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం అనుష్క శెట్టిని తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు చిత్ర బృందం కూడా చర్చలు నిర్వహించిందట. దీనికి అనుష్క శెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.






