Anushka Sharma: విరాట్ కోహ్లీ సతీమణి చిన్ననాటి పిక్స్ లీక్.. క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోన్న బ్యూటీ

by Kodari Anjali |

బాలీవుడ్ నటి అనుష్క శర్మ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Anushka Sharma: విరాట్ కోహ్లీ సతీమణి చిన్ననాటి పిక్స్ లీక్.. క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోన్న బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి అనుష్క శర్మ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టార్టింగే ఈ బ్యూటీ బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ సినిమాలో అవకాశం కొట్టేసింది. రబ్ నే బనా ది జోడి సినిమాలో నటించి మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా ఈ చిత్రంలో అద్భుతంగా నటించినందుకు అనుష్క శర్మకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకుంది.

తర్వాత ఈ నటి క్రైమ్ థ్రిల్లర్ NH10 అండ్ దిల్ ధడక్నే దో, ఏ దిల్ హై ముష్కిల్, సుయి ధాగాలలో దృఢ సంకల్పం కలిగిన మహిళల పాత్ర పోషించి నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. వీటితో పాటుగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు స్పోర్ట్స్ డ్రామా సుల్తాన్, రాజ్ కుమార్ హిరానీ సినిమాలు పికె అండ్ సంజు వంటి చిత్రాల్లో చాన్స్ అందుకుంది.

ఇకపోతే అనుష్క అండ్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమ వివాహం చేసుకుని.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ అనుష్క శర్మ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యూట్ క్యూట్ లుక్స్‌ ప్రజలందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం పిక్స్ నెట్టింట వైరల్ అవ్వగా జనాలు క్యూట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story