- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొరియన్ డ్రామాలో అనుష్క.. ఫస్ట్ ఇండియన్ హీరోయిన్‌గా రికార్డు..(ఫుల్ డిటేయిల్స్)
బ్యూటీఫుల్ అనుష్కా సేన్ రికార్డ్ క్రియేట్ చేసింది. కొరియన్ మూవీలో నటిస్తున్న తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించింది. ఇండో-కొరియన్ ఎంటర్‌టైన్మెంట్ రంగంలో కొత్త ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేస్తోంది.

దిశ, వెబ్‌సైట్ : బ్యూటీఫుల్ అనుష్కా సేన్ రికార్డ్ క్రియేట్ చేసింది. కొరియన్ మూవీలో నటిస్తున్న తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించింది. ఇండో-కొరియన్ ఎంటర్‌టైన్మెంట్ రంగంలో కొత్త ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ చేస్తోంది. కాగా అనుష్క.. లీ జంగ్-సబ్ దర్శకత్వంలో వస్తున్న కొరియన్ చిత్రం ఆసియాలో కనిపించనుంది. క్రష్ అనే స్పిన్-ఆఫ్ సిరీస్‌లో కూడా భాగమవుతోంది. అంతేకాదు సియోల్, బుసాన్‌లలో భారీ బిల్‌బోర్డ్‌లపై కనిపించిన మొదటి భారతీయ సెలబ్రిటీగా నిలిచింది 22 ఏళ్ల అనుష్క.
ఇక బాల్ వీర్ టీవీ షోతో అరంగేట్రం చేసి.. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేజిక్కించుకుంటున్న ఈ యంగ్ బ్యూటీ.. టాలెంట్‌కు లిమిట్స్ ఉండవని నిరూపిస్తోంది. కాగా ఇప్పటికే అనుష్క బ్రాండ్ డీల్స్, గ్లోబల్ ప్రాజెక్టుల ద్వారా నెలకు ₹75 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వన్స్ రిలీజ్ అయ్యిందంటే మరింత దూసుకుపోతుందని చెప్తున్నారు విశ్లేషకులు. దీంతో ఆమె అభిమానులు గర్వంగా ఫీల్ అవుతూ.. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.






