- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇప్పుడు నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు. ఒకప్పుడు హిందీలో సంచలన విజయాలు అందించిన ఆయన, ఇప్పుడు దక్షిణాది సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా విజయ్ సేతుపతి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. "నేను కావాలని నటుడిని కాలేదు. అది అనుకోకుండా జరిగింది. కానీ సౌత్ నుండి నాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా 'మహారాజ' సినిమా నా జీవితాన్ని మార్చేసింది. విజయ్ సేతుపతి స్వయంగా అడిగితేనే ఆ సినిమాలో నటించాను. అది సూపర్ హిట్ కావడంతో నాకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస ఆఫర్లు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే, విజయ్ సేతుపతి వల్లే నా కూతురి పెళ్లి కూడా చేయగలిగాను."
"నా కూతురు పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ విషయం ఒకసారి విజయ్ సేతుపతికి చెప్పాను. వెంటనే ఆయన ఆర్థికంగా సహాయం చేస్తానని అన్నారు. అదే సమయంలో 'మహారాజ' సినిమాలో అవకాశం ఇప్పించారు. ఆ సినిమా ద్వారా వచ్చిన డబ్బుతో ఎటువంటి ఇబ్బంది లేకుండా నా కూతురి పెళ్లి ఘనంగా చేయగలిగాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. 'మహారాజ' తర్వాత విజయ్ సేతుపతితో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. నాకు ఏ కష్టం వచ్చినా ఆయన ఒక పెద్దన్నలా అండగా ఉంటారు. నార్త్ కంటే సౌత్ లోనే నటుడిగా నాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి" అని అనురాగ్ కశ్యప్ తన మనసులోని మాటలను పంచుకున్నారు.






