- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాకెందుకు నేషనల్ అవార్డులు ఇవ్వరు.. అనుపమ
‘అనుపమ’ సీరియల్ నటి రూపాలీ గంగూలీ.. టైటిల్ పాత్రలో ఒదిగిపోయింది. విమర్శల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ హిందీ టీవీ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతోంది. అయితే ఈ మధ్య ఈ యాక్ట్రెస్ సంచలన కామెంట్స్ చేసింది. ఇటీవలే 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించగా..

దిశ, వెబ్ డెస్క్ : ‘అనుపమ’ సీరియల్ నటి రూపాలీ గంగూలీ.. టైటిల్ పాత్రలో ఒదిగిపోయింది. విమర్శల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ హిందీ టీవీ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతోంది. అయితే ఈ మధ్య ఈ యాక్ట్రెస్ సంచలన కామెంట్స్ చేసింది. ఇటీవలే 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించగా.. సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు టెలివిజన్ ఇండస్ట్రీకి కూడా నేషనల్ అవార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. టెలివిజన్ నటీనటులను గుర్తించాలని.. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని కోరింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడిన ఆమె.. కరోనా మహమ్మారి సమయంలో కూడా బుల్లితెర నటీనటులు పని చేశారని.. మూవీ స్టార్స్, కంటెంట్ క్రియేటర్స్‌కు అవార్డ్స్ ఉన్నప్పుడు తమకు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించింది. తమను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. కాగా ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే అవార్డును పంచుకోగా.. ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ ఎంపికైంది.






