Anupama Parameswaran: అలాంటి సినిమాలకు సపోర్ట్ ఉండదు.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరదా’.

Anupama Parameswaran: అలాంటి సినిమాలకు సపోర్ట్ ఉండదు.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరదా’. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా.. థీమ్ ఆఫ్ పరదా ‘యత్ర నార్యస్తు పూజ్యంతే’ అనే సాంగ్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సంరద్భంగా అనుపమ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘లేడీ ఓరీయెంటెడ్ మూవీస్ చేయాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. కథ మొత్తం మా చుట్టే తిరగాలి అని.. సినిమాలో మేమే హైలెట్ కావాలని ఏ హీరోయిన్ అనుకోకుండా ఉంటుంది.

కానీ ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో నటిస్తుందంటే ఎవరూ ముందుకురారు. సపోర్ట్ చేయరు. నిర్మాతలు, ఓటీటీ సంస్థలు, కొన్ని సార్లు ఆడియన్స్ కూడా సపోర్ట్ చేయరు. అది ఎంత మంది సినిమా అయినా ఏదో ఒక వెలితి వారికి కనిపిస్తుంది. ఈ సినిమా సంవత్సరం క్రితమే రెడీ అయింది. రిలీజ్ చేద్దాం అనే టైమ్‌కు ఏదో ఒక ఆటంకం వచ్చేది. పెద్ద సినిమాలు రిలీజ్ ఉండటం.. థియేటర్స్ దొరకపోవడం ఇలా. ఇది చిన్న సినిమా అని అందరూ భావిస్తున్నారు కానీ చాలా మంచి సినిమా. ఎన్నో కమర్షియల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ‘పరదా’ను అందరూ తప్పకూండా థియేటర్స్‌లో చూసి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’ అని తెలిపింది.

Next Story