Anupama Parameswaran: ఆ సినిమా నాకు చాలా నేర్పింది.. అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |

రీసెంట్ తమిళ హిట్ ‘బైసన్’తో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది అనుపమ పరమేశ్వరన్.

Anupama Parameswaran: ఆ సినిమా నాకు చాలా నేర్పింది.. అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: రీసెంట్ తమిళ హిట్ ‘బైసన్’తో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది అనుపమ పరమేశ్వరన్. ధృవ్ విక్రమ్, మారి సెల్వరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 17న తమిళంలో రిలీజై హిట్ అందుకోగా.. అక్టోబర్ 24న తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా మీడియా సమావేశంలో అనుపమ ఆసక్తిర విషయాలు పంచుకుంది. ‘మారి సెల్వరాజ్ సినిమాలో చేయాలనేది నా డ్రీమ్. ఆయన మొదట ఆఫర్ చేసినప్పుడే నటించాల్సింది. కానీ అప్పుడు నాకు షెడ్యూల్ ప్రాబ్లెమ్ ఉండి కుదరలేదు.

ఇప్పుడు ‘బైసన్’లో ఆయనతో పనిచేసే అవకాశం రావడం నాకు నిజంగా స్పెషల్. ఈ సినిమా నాకు కొత్తగా చాలా నేర్పింది. ధృవ్ విక్రమ్‌లో ఉన్న ప్యాషన్ అద్భుతం. సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. షూటింగ్ సమయంలో ఆయనలో కనిపించిన ఆ డెడికేషన్ చూసి నేను ఇన్‌స్పైర్ అయ్యాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. గర్వంగా ఫీల్ అవుతున్నా.. ఈ మూవీకి తమిళంలో అద్భుతమైన స్పందన లభించింది.. అందుకే తెలుగులో కూడా రిలీజ్ చేయాలని డిమాండ్ ఎక్కువగా ఉంది. అక్టోబర్ 24న మీ ముందుకు రాబోతున్నాం.. ఇక్కడ కూడా సపోర్ట్ చేసి హిట్ ఇస్తారని ఆశిస్తున్నాము’ అని తెలిపింది.

Next Story