‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరోకు బంపర్ ఆఫర్.. స్టార్ హీరోయిన్‌తో రొమాన్స్

by Sujitha Rachapalli |

బ్యూటిపుల్ అనుపమ పరమేశ్వరన్ 2025లో మంచి సినిమాలతోనే వచ్చింది. కానీ ‘పరదా’ చిత్రం తగినంత సక్సెస్ అందుకోకపోవడంపై నిరాశ వ్యక్తం చేసింది. ఇక తాజాగా ఆమె మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ పెద్ద నిర్మాణ సంస్థ

‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరోకు బంపర్ ఆఫర్.. స్టార్ హీరోయిన్‌తో రొమాన్స్
X

దిశ, సినిమా : బ్యూటిపుల్ అనుపమ పరమేశ్వరన్ 2025లో మంచి సినిమాలతోనే వచ్చింది. కానీ ‘పరదా’ చిత్రం తగినంత సక్సెస్ అందుకోకపోవడంపై నిరాశ వ్యక్తం చేసింది. ఇక తాజాగా ఆమె మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ పెద్ద నిర్మాణ సంస్థ నిర్మించనున్న సినిమాలో హీరోయిన్‌గా ఓకే చెప్పిందని.. ఇందులో ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్ హీరోగా నటించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. అఖిల్ రాజ్‌ గ్రాఫ్ పెరుగుతున్నట్లే అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే వరుసగా ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’తో రెండు హిట్లు అందుకున్న యంగ్ హీరోకు ఇండస్ట్రీ నుంచి వరుస అవకాశాలు వస్తుండగా.. పాత్రలు ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ కుర్ర హీరో పక్కన నటించేందుకు అనుపమ ఓకే చెప్పిందంటే కంటెంట్ ఉన్న సినిమానే అంటున్నారు విశ్లేషకులు.

Next Story