- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒంటి నిండా నగలు.. చీరలో మోడ్రన్ లుక్.. డిఫరెంట్ స్టైల్‌లో విపరీతంగా ఆకట్టుకుంటోన్న అనుపమ పోస్ట్
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తమిళ చిత్రమైన కోడి సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తమిళ చిత్రమైన కోడి సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈ బ్యూటీ 2017 జనవరిలో విడువలైన శతమానం భవతి సినిమాలో శర్వానంద్ సరసన నటించి.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇక ప్రేమమ్, అఆ, నటసార్వభౌమ, ఉన్నది ఒక్కటే జిందగీ, కార్తికేయ 2, టిల్లు స్వ్కేర్ వంటి సినిమాల్లో అవకాశం కొట్టేసి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
తన టాలెంట్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఉత్తమ నటిగా పేరు తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్ కేవలం తెలుగులోనే కాకుండా.. మలయాళ, తమిళ చిత్రాల్లో కూడా నటించి జనాల మెప్పు పొందింది. ఇకపోతే అనుపమ అటు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని ఆకట్టుకుంటుంది.
అయితే తాజాగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను అబ్బురపరుస్తుంది. ఒంటి నిండా నగలు.. చీరలో మోడ్రన్ లుక్.. డిఫరెంట్ స్టైల్‌లో విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఫొటోలు అనుపమ అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






