- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాక్ డౌన్ ట్రైలర్ అప్డేట్‌తో సినిమాపై హైప్ పెంచిన అనుపమ
సర్వైవల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన చిత్రం ‘లాక్ డౌన్’.

దిశ, సినిమా: సర్వైవల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన చిత్రం ‘లాక్ డౌన్’. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మూవీ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ‘ప్రతి క్షణం మీ బలాన్ని పరీక్షించే ప్రపంచం.. లాక్ డౌన్ ట్రైలర్ 27-11న ఉదయం 11 గంటలకు విడుదల అవుతుంది’ అంటూ అనుపమ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ ట్రైలర్‌పై అంచనాలు పెంచుతోంది. కాగా.. ఈ చిత్రం దర్శకుడు ఏ.ఆర్. జీవా ఫీచర్ డైరెక్టోరియల్ డెబ్యూట్. లైకా ప్రొడక్షన్స్ సుబాస్కరన్ బ్యాకింగ్‌లో రూపొందిన ఈ మూవీలో అనుపమాతో పాటు చార్లీ, నిర్మల, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, ఇందుమతి, రాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇది ఎమోషన్స్‌తో కూడిన, సస్పెన్స్ సినిమా అని అర్థమవుతుండగా.. ఇప్పటికే ‘లాక్ డౌన్’పై ప్రేక్షకుల్లో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.






