- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్టార్ హీరో కొడుకుతో అనుపమ డేటింగ్.. హాట్ టాపిక్‌గా మారిన ట్వీట్
‘శతమానం భవతి’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఈమెజ్‌ను క్రియేట్ చేసుకుంది అనుపమ

దిశ, సినిమా: ‘శతమానం భవతి’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఈమెజ్‌ను క్రియేట్ చేసుకుంది అనుపమ(Anupama Parameswaran). ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఇటీవల ‘డ్రాగన్’(Dragon) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక త్వరలో ‘పరదా’(Parada) సినిమాతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో సీనియర్ హీరోయిన్ సంగీత(Sangeetha), మలయాళ కుట్టి దర్శన రాజేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ‘పరదా’ వర్క్‌లో ఫుల్ బిజీ అయిపోయిన అనుపమ పరమేశ్వరన్‌కు సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ ప్రజెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అనుపమ ‘పరదా’తో పాటు ‘బైసన్’(Bison) అనే మరో తమిళ మూవీలో నటిస్తుంది. మరి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సమీర్ నాయర్, దీపక్ సీగల్, పా.రంజిత్, అదితి ఆనంద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో స్టార్ హీరో చియాన్ విక్రమ్(Chiyaan Vikram) కుమారుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) హీరోగా నటిస్తుండగా.. హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రజెంట్ డేటింగ్‌లో ఉన్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అంతే కాకుండా ఇందుకు సంబంధించిన పోస్టులు సైతం నెట్టింట దర్శనమివ్వడంతో.. ప్రజెంట్ ఆ పోస్టులు హాట్ టాపిక్‌గా మారాయి.






