రంగస్థలం సినిమా కారణంగా నా కెరీర్ దెబ్బతిన్నది.. రామ్ చరణ్‌తో కావాలనే.. అనుపమ పరమేశ్వరన్ సంచలనం

by Sujitha Rachapalli |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్యూటిఫుల్ సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో చెర్రీ చెవిటి వ్యక్తిగా కనిపించి.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ సినిమాలో ముందుగా అనుపమ పరమేశ్వరన్

రంగస్థలం సినిమా కారణంగా నా కెరీర్ దెబ్బతిన్నది.. రామ్ చరణ్‌తో కావాలనే.. అనుపమ పరమేశ్వరన్ సంచలనం
X

దిశ, వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్యూటిఫుల్ సమంత హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో చెర్రీ చెవిటి వ్యక్తిగా కనిపించి.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఈ సినిమాలో ముందుగా అనుపమ పరమేశ్వరన్ ఓకే అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆమె ప్లేస్‌లో సమంతను తీసుకున్నట్లు టాక్. కాగా ఈ విషయంపై తాజాగా మాట్లాడిన అనుపమ.. ఇది నిజమేననని, కానీ తాను ప్రాజెక్ట్ నుంచి బయటకు పోలేదని, మేకర్స్ వద్దనుకున్నారని చెప్పింది. అయితే బయట మాత్రం తానే ప్రాజెక్ట్ నుంచి కావాలనే ఎగ్జిట్ అయినట్లు.. రామ్ చరణ్‌తో నటించడం ఇష్టం లేక ఇదంతా చేసినట్లు ప్రచారం చేశారని తెలిపింది. దీనివల్ల ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి తమకు వద్దని.. అప్పట్లో తను చేసిన ప్రాజెక్టులన్నీ కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. దీనివల్ల తన కెరీర్‌కు చాలా అన్యాయం జరిగిందని బాధపడింది.

Next Story