OTT: సడెన్‌గా ఓటీటీలోకి అనుపమ పరదా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే

by Chukka Sudharani |

యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘పరదా’ (Parada).

OTT: సడెన్‌గా ఓటీటీలోకి అనుపమ పరదా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘పరదా’ (Parada). ప్రణీత్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 1980లో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా తీసుకుని.. ఆ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 22న థియేటర్స్‌లోకి వచ్చింది. కానీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు సడేన్‌గా ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా ఓటీటీ (OTT)లోకి ఎంట్రీ ఇచ్చింది పరదా మూవీ. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకోగా.. ఈ రోజు నుంచి తెలుగుతో పాటు మలయాళంలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. లింక్

Next Story