- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ANUPAMA PARAMESHWARAN: జడలో పూలు.. అందానికి అసూయ పుట్టేలా ఉందిగా
ప్రస్తుతం అనుపమకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఈమె చంకీలు పొదిగిన డ్రెస్ వేసుకొని, కొప్పు జడలో రోజ్ ఫ్లవర్స్ పెట్టుకొని తన అందాలు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ బ్యూటిఫుల్ నటి అనుపమ పరమేశ్వరన్ "అఆ" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించిన ఈమె తన నటనతో, అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. అనుపమ సినీ ప్రస్థానం మొదలయ్యి చాలా సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు ఈమె చిన్న, మీడియం రేంజ్ మూవీలలో తప్ప స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలను దక్కించుకోలేకపోయింది.
కానీ ఈమె నటించిన చాలా చిత్రాలు మంచి విజయాలను అందుకోవడం, అందులో ఈమె తన అందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో అనుపమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పడింది. కెరియర్ ప్రారంభంలో చాలావరకు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలతో ఆకట్టుకున్న ఈమె ఈ మధ్యకాలంలో భారీ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుంది. రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్ చిత్రాలలో ఈమె భారీ స్థాయిలో అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనుపమ సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ వస్తుంది.
తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. అందులో ఈ ముద్దుగుమ్మ చంకీలు పొదిగిన డ్రెస్ వేసుకొని, కొప్పు జడ కట్టుకొని అందులో రోజ్ ఫ్లవర్స్ పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో తన అందాలు ప్రదర్శితమయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో అనుపమ చాలా అందంగా ఉండి అందానికే అసూయ పుట్టేలా ఉంది. దానితో అనుపమకి సంబంధించిన ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
- Tags
- anupama






