Anupama: క్లాస్‌లో మాస్ మిక్స్ చేస్తోంది.. సైలెంట్‌గా అందాల ఆరబోత

by Pulgam srinivas |

Anupama: రీసెంట్ టైంలో ఈ బ్యూటీ క్లాస్ అండ్ మాస్ ఫోటోలతో యువతను ఆకట్టుకుంటోంది.

Anupama: క్లాస్‌లో మాస్ మిక్స్ చేస్తోంది.. సైలెంట్‌గా అందాల ఆరబోత
X


దిశ, వెబ్ డెస్క్: మలయాళ చిత్రం 'ప్రేమమ్' ద్వారా గుర్తింపును సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్, 'అ ఆ' అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.




ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె, ఆ తర్వాత వరుసగా టాలీవుడ్‌లో క్రేజీ చిత్రాల్లో అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.




అనుపమ నటిగా కెరీర్‌ను ప్రారంభించిన కొత్తలో ఎక్కువ శాతం స్కిన్ షో చేయకుండా డీసెంట్ అండ్ క్లాస్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించింది. కానీ గత కొంతకాలంగా ఈమె గ్లామర్ డోస్‌ను పెంచుతూ, కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.




ముఖ్యంగా ఈ హీరోయిన్ 'రౌడీ బాయ్స్', 'టిల్లు స్క్వేర్' సినిమాల్లో గ్లామర్‌ షోతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తోంది.




కొన్ని సందర్భాల్లో క్లాస్ ఫోటోలతో అలరిస్తూ, మరికొన్ని సందర్భాల్లో మాస్ యాంగిల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇలా ఈ యువ నటి క్లాస్ అండ్ మాస్ మిక్స్‌తో యువతను ఆకట్టుకుంటుంది. ఇటీవల కాలంలో ఈమె కేవలం లవ్, రొమాంటిక్ మరియు కమర్షియల్ సినిమాల్లో మాత్రమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది.

Photos Courtesy: Instagram

Next Story