- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మర్ స్పెషల్‌గా అనుపమ ‘JSK’.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’(J.S.K).

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’(J.S.K). యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణ(Praveen Narayana) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కాస్మోన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె. ఫణీంద్ర కుమార్(Phaneendra Kumar) నిర్మిస్తున్న ఈ మూవీలో.. బైజు సందోష్(Baiju Sandosh), మాధవ్ సురేష్ గోపి(Madhav Suresh Gopi), దివ్యా పిళ్లై(Divya Pillai), అస్గర్ అలీ(Asgar Ali) వంటి ప్రముఖులు కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇక ఇందులో అనుపమ జానకి(Janaki) పాత్రలో కనిపించనుండగా.. ఆమె తరఫున వాదించే లాయర్‌గా ప్రధాన పాత్రలో సురేష్ గోపి(Suresh Gopi) నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో ఈ సమ్మర్‌లో ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. కాగా రీసెంట్‌గా ఫిబ్రవరిలో ఈ మూవీ విడుదల చేస్తామని మేకర్స్ తెలిపిన సంగతి తెలిసిందే.






