Anupama Parameswaran: కొత్త సినిమా ప్రకటించిన అనుపమ.. భయంకరమైన విషయం వెంటాడుతోందంటూ హైప్ పెంచేస్తున్న పోస్ట్

by Mallepaka Hamsa |

మలయాళ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ‘ప్రేమమ్’ చిత్రంతో వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Anupama Parameswaran: కొత్త సినిమా ప్రకటించిన అనుపమ.. భయంకరమైన విషయం వెంటాడుతోందంటూ హైప్ పెంచేస్తున్న పోస్ట్
X

దిశ, సినిమా: మలయాళ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ‘ప్రేమమ్’ చిత్రంతో వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అఆ, మజ్ను వంటి సినిమాల్లో నటించి అనతి కాలంలోనే ఫుల్ క్రేజ్ దక్కించుకుని హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి హిట్ అందుకున్న అనుపమ తన అందంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది. ఇక గత ఏడాది ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) సినిమాలో బోల్డ్‌గా నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇటీవల ‘డ్రాగన్’(Dragon) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

అదే ఫామ్‌లో ఈ అమ్మడు వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ రింగుల జుట్టు సుందరి బైసన్, పరదా, jsk, పెట్ డిటెక్టివ్, వంటి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లలో హీట్ పుట్టిస్తోంది. ఈక్రమంలో.. తాజాగా, అనుపమ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ఓ హారర్ మూవీతో రాబోతున్నట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆసక్తికర పోస్ట్‌ పెట్టింది. అయితే ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) హీరోగా నటిస్తుండగా.. ‘BSS 11’ వర్కింట్ టైటిల్‌తో తెరెక్కుతోంది.

కౌశిక్ పెగళ్లపాటి(Kaushik Pegallapati) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి(Sahu Garapati) నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఏప్రిల్ 27న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేసింది. ఒక ఇందులో సువర్ణమాయ అని ఓ రేడియో ఆఫీసు ముందు ఓ వ్యాన్ తగలబడిపోతుంది. FM 919 దగ్గర పాయింట్ బార్ ఉన్న ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇక ఈ పోస్ట్‌కు అనుపమ ‘మిమ్మల్ని ఓ భయంకరమైన విషయం వెంటాడుతోంది’’ అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌ను జత చేసింది.

Next Story