- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ సినిమాలో అనుపమ 2.0ని చూస్తారు.. నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పరదా’(Paradha).

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పరదా’(Paradha). ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహించిన ఈ మూవీని.. ఆనంద్ మీడియా బ్యానర్ పై శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ, విజయ్ డొకడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇందులో దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆగస్టు 22న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీటీమ్ ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
అయితే ఈ కార్యక్రమానికి హీరో రామ్ పోతినేని(Ram Pothineni) అతిథిగా విచ్చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఇందులో భాగంగా నిర్మాత విజయ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో అనుపమ 2.0ని చూడబోతున్నామని, తను అంత అద్భుతంగా నటించిందని చెప్పుకొచ్చారు. అలాగే డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘ఇది బిగ్ స్కేల్‌తో తీసిన ప్రాపర్ కమర్షియల్ సినిమా అని, ఈ మంచి ప్రయత్నానికి ఆర్థికంగా కూడా విజయాన్నిస్తే.. ఇలాంటి మంచి కథలు మరిన్ని వస్తాయని తెలిపారు.






