- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పహల్గామ్‌లో ‘అనుమాన పక్షి’.. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న టీమ్
డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న మరో ఎంటర్‌టైన్మెంట్ చిత్రం ‘అనుమాన పక్షి’.

దిశ, సినిమా: డీజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న మరో ఎంటర్‌టైన్మెంట్ చిత్రం ‘అనుమాన పక్షి’. ఇందులో రాగ్ మయూర్ హీరోగా నటిస్తుండగా.. చిలకా ప్రొడక్షన్స్‌పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతోన్న ఈ చిత్రం తాజాగా కశ్మీర్‌లోని పహల్గామ్, శ్రీనగర్ ప్రాంతాల్లో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో అక్కడ జరిగిన దుర్ఘటన తర్వాత మళ్లీ పహల్గామ్‌లో షూట్ చేసుకోవడంతో.. సీఆర్పీఎఫ్ మార్గదర్శకత్వంలో, అన్ని భద్రతా నియమాలు పాటిస్తూ 20 రోజుల పాటు ఇంటెన్స్ షెడ్యూల్ షూట్ చేశారు. ఈ షెడ్యూల్‌తో సినిమాకి దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయింది. నవంబర్ చివర్లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విభిన్న కథతో, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న “అనుమానపక్షి” త్వరలో థియేటర్లలోకి రానుంది.






