Anu Emmanuel: రెడ్ సారీలో క్యూట్ లుక్‌తో కట్టిపడేస్తున్న క్రేజీ బ్యూటీ

by Pulgam srinivas |   (  Updated:2026-04-01 15:25:37  IST  )

రెడ్ సారీలో క్యూట్ లుక్‌తో కట్టిపడేస్తున్న అను ఇమ్మాన్యుయేల్

Anu Emmanuel: రెడ్ సారీలో క్యూట్ లుక్‌తో కట్టిపడేస్తున్న క్రేజీ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి అను ఇమ్మాన్యుయేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని హీరోగా తెరకెక్కిన ‘మజ్ను’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్‌కు మొదటి సినిమాతోనే మంచి విజయం దక్కింది.

అయితే ఆ తర్వాత మాత్రం ఈ బ్యూటీ కెరీర్ సాఫీగా సాగలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో, మంచి క్రేజ్ ఉన్న చిత్రాల్లో అవకాశాలు దక్కినప్పటికీ వాటితో పెద్దగా విజయాలు మాత్రం అందుకోలేకపోయింది. తెలుగులో వరుస పరాజయాలు ఎదురైన తర్వాత ఈమె ఇతర ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది.

కానీ అక్కడ కూడా ఈమెకు పెద్దగా అనుకూల ఫలితాలు రాలేదు. ఈ ముద్దుగుమ్మకు విజయాలు పెద్దగా దక్కకపోయినా, అనేక సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమాల్లో మాత్రమే కాకుండా, అను ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియాలో కూడా తరచూ గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తోంది.

దీంతో ఈమెకు సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈమె సాంప్రదాయబద్ధంగా ఎరుపు రంగు చీర కట్టుకొని, అందుకు సరిపోయే ఎరుపు రంగు బ్లౌజ్ ధరించి కనిపించింది.

మెడలో భారీ నెక్లెస్, చేతులకు గాజులు ధరించి, తన నల్లని జుట్టును ముందుకు వదిలి స్టైలిష్ లుక్‌లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో అను ఇమ్మాన్యుయేల్ ఎంతో అందంగా కనిపించడంతో, ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story