- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిధి అగర్వాల్‌తో నీచ ప్రవర్తన.. వెలుగులోకి మరో వీడియో
నిధి అగర్వాల్‌తో నీచ ప్రవర్తన.. వెలుగులోకి మరో వీడియో

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal)కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. బుధవారం లూలూ మాల్‌లో రాజాసాబ్ సినిమాలోని రెండో పాట విడుదల నిధి అగర్వాల్ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే కొందరు దురభిమానులు గుమిగూడి హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఇబ్బందికి గురి చేయడంతో సోషల్ మీడియాలో వీడియోలు హల్‌చల్ చేశాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వందల సంఖ్యలో అభిమానులు మీద పడటంతో నిధికి ఊపిరి ఆడకుండా పోయింది. రక్షించే వారు లేక, బౌన్సర్లు లేక చాలా ఇబ్బంది పండింది. అభిమానులు ఎక్కడ పడితే అక్కడ తాకుతూ చాలా నీచంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. తాజాగా మరో వీడియో హల్‌చల్ చేస్తోంది. చాలా క్లోజ్‌గా నిధిని వెనుకవైపు టచ్ చేస్తూ ఉన్న వీడియోలు తాజాగా నెట్టింట పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురితో పాటు నెటిజన్లు కూడా అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసును కూకట్‌పల్లి పోలీసులు సుమోటోగా స్వీకరించారు. నిర్వాహకులతోపాటు మాల్ యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు. ఈవెంట్‌కు సంబంధించి ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదని పోలీసులు వెల్లడించారు.






