Aryan: సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ నుంచి మరో అప్డేట్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్

by Chukka Sudharani |

ప్రవీణ్ కె దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘ఆర్యన్’.

Aryan: సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆర్యన్’ నుంచి మరో అప్డేట్.. ఆకట్టుకుంటోన్న పోస్టర్
X

దిశ, సినిమా: ప్రవీణ్ కె దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘ఆర్యన్’. విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్‌లతో కలిసి నిర్మించిన ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన టీజర్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా ఆర్యన్ నుంచి ‘ఐయామ్ ది గాయ్’ సాంగ్ రిలీజ్ చేశారు. జిబ్రాన్ స్వరపరిచిన ఈ పాటనకు సామ్రాట్ సాహిత్యం అందించారు. జిబ్రాన్, శ్రీకాంత్ హరిహరన్ అద్భుతంగా పాడారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అక్టోబర్ 31న విడుదల కానుండగా.. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నారు. సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story