- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయాల్లోకి మరో తమిళ హీరో?
ధనుష్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావచ్చని ఆయన తండ్రి కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇప్పటివరకు ఎంతోమంది తమిళ హీరోలు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో నటుడు విజయ్ రాజకీయ రంగంలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఆయన స్థాపించిన పార్టీ మంచి ఫలితాలు సాధించడంతో ప్రస్తుతం ఆయన తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక తాజాగా మరో తమిళ నటుడు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు అనే వార్తలు కోలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
దీనికి ప్రధాన కారణం నటుడు ధనుష్ తండ్రి కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలే. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి రాజా మాట్లాడుతూ... రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. అది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్నవారు రాజకీయాల్లోకి రావడంలో తప్పేమీ లేదు. భవిష్యత్తులో ధనుష్ కూడా రాజకీయాల్లోకి రావచ్చు. అలాగే సెల్వరాఘవన్ కూడా రాజకీయాల్లోకి రావచ్చు అని వ్యాఖ్యానించారు.
అలాగే తాను మాత్రం రాజకీయాల్లోకి రానని, తనకు ఇప్పటికే వయసు అయిపోయిందని కస్తూరి రాజా తెలిపారు. నా కుమారులు మాత్రమే కాదు మనవళ్లు కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావచ్చు” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ధనుష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా? అనే చర్చ కోలీవుడ్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల ధనుష్ నటించిన కర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదనే స్థాయి విజయాన్ని అందుకుంది.






