లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ.. వైరల్‌గా మారిన ట్వీట్

by Chukka Sudharani |   (  Updated:2025-05-15 14:39:02  IST  )

మల్టీ టాలెంటెడ్‌గా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న ఫేమస్ హీరో రాఘవా లారెన్స్(Raghava Lawrence).. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు.

లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ.. వైరల్‌గా మారిన ట్వీట్
X

దిశ, సినిమా: మల్టీ టాలెంటెడ్‌గా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న ఫేమస్ హీరో రాఘవా లారెన్స్(Raghava Lawrence).. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘BENZ’. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తుండగా.. మూవీ అనౌన్స్‌మెంట్ వీడియోతో హైప్ పెంచేశాడు. అంతే కాకుండా.. ‘ఒక కారణం ఉన్న యోధుడు అత్యంత ప్రమాదకరమైన సైనికుడు’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ ఫస్ట్ లుక్ వీడియో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నప్పటికీ షూటింగ్ అప్‌డేట్, నటీనటుల వివరాలు కానీ తెలియజేయలేదు. మూవీ యూనిట్ దీంతో రాఘవ లారెన్స్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ (Nivin Pauly) కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మేరకు ‘నివిన్‌పౌలీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లోకి అడుగుపెడుతున్నారు! రాఘవ లారెన్స్‌తో కలిసి బెంజ్‌లో కీలక పాత్ర పోషించబోతున్నారు’ అంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Click For Tweet..

Next Story