- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dhanush: ధనుష్ సినిమా నుంచి మరో స్పెషల్ పోస్టర్ రిలీజ్.. మెస్మరైజ్ చేస్తున్న లుక్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’. ఆయన స్వియ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 1న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈక్రమంలోనే అప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం వరుస అప్డేట్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ‘ఇడ్లీ కడై’ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ఈ నెల 27న రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. అందులో ధనుష్ జైంట్విట్ దగ్గర పిల్లలతో కలిసి ఉండగా.. తాజాగా మరో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇందులో వర్షం పడుతున్న రోడ్డుపై ధనుష్, నిత్యామీనన్ (Nithya Menon) నడుస్తుండగా.. ధనుష్ నిత్యాపై చేయి వేసి నడుస్తున్నట్లు చూపిస్తాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. కాగా.. ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరుణ్ విజయ్, అశోక్ సెల్వన్, రాజ్‌కిరణ్, సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. లింక్






