- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేడీ సూపర్ స్టార్ నుంచి మరో షాకింగ్ స్టెప్
మెల్లిమెల్లిగా ప్రమోషన్స్ వైపు అడుగులు వేస్తున్న నయనతార.. మొన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’, ఇప్పుడు ‘ఎల్‌ఐకే’.

దిశ, వెబ్ డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా సంవత్సరాల క్రితమే వెండితెరకు పరిచయమైంది. ఇప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్‌గా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను ఎప్పుడో సంపాదించుకున్న ఈమె, జవాన్ సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న హిందీ చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా కనిపించబోతోంది. ఇదిలా ఉంటే, సాధారణంగా నయనతార ఏ ప్రమోషనల్ ఈవెంట్‌కూ హాజరుకాదు.
దాంతో చాలామంది నయనతార ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ చేయదని, దానికోసం ఎక్కడికీ రాదని ఫిక్స్ అయిపోయేవారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఆమె తన రూట్‌ను మార్చినట్లు కనిపిస్తోంది. కొంతకాలం క్రితం ఈమె నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి సంబంధించి ఒకటి, రెండు ప్రమోషనల్ వీడియోల్లో కనిపించింది. దీంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అనిల్ రావిపూడి ఎవరితోనైనా ఏదైనా చేయించగలడని, అది ఆయన మ్యాజిక్ అని ఆయనపై ప్రశంసలు కూడా కురిపించారు.
ఇకపోతే నయనతార కూడా ఈ మధ్యకాలంలో కాస్త ప్రమోషనల్ వైపు అడుగులు వేస్తోంది. తాజాగా ఈమె తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఎల్‌ఐకే (LIK) చిత్రానికి సంబంధించిన ఓ ఈవెంట్‌లో తలుక్కున మెరిసి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా మెల్లిమెల్లిగా ఈమె ప్రమోషనల్ కంటెంట్ వైపు అడుగులు వేస్తూ ఉండడంతో, చాలామంది నయనతార మరికొంత కాలంలో ఏదైనా సినిమా చేస్తే, ఆ సినిమా విషయంలో ఫుల్ ప్రమోషన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.






