- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay: హీరో విజయ్‌కి మరో షాక్..!
by Ramesh Naini |
తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్‌కి వ్యక్తిగత జీవితంలో వరుస షాక్‌లు తగులుతున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్‌కి వ్యక్తిగత జీవితంలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తాజాగా కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కుమారుడు చేసిన ఈ చర్య వెనుక కారణాలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఓ నటితో విజయ్‌కు అఫైర్ ఉందని భార్య సంగీత చేసిన ఆరోపణల్లో నిజం ఉండొచ్చని, అందుకే జేసన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు, భార్య చేసిన ఆరోపణలపై విజయ్ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.
Next Story






