- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలకృష్ణ అఖండ-2 సినిమాకు మరో BIG షాక్
బాలకృష్ణ అఖండ-2 సినిమాకు మరో BIG షాక్

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న అఖండ-2 సినిమాకు మరో అనూహ్య షాక్ తగిలింది. అఖండ-2 సినిమాకు టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా విచారించిన కోర్టు.. ప్రీమియర్ షో రేట్లు పెంపు జీవో సస్పెన్షన్ విధించింది. ప్రీమియర్ షోలతో పాటు టికెట్లు రేట్ల పెంపు సర్క్యూలర్‌ను రద్దు చేసింది. తెలంగాణ హోంశాఖ, అఖండ-2 సినిమా నిర్మాతకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. తెలుగు ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా, అఖండ-2 మూవీ వాస్తవానికి డిసెంబర్ 5న విడుదల కావలసి ఉంది. పలు కారణాల వలన వాయిదా పడింది. ఇక ఎట్టకేలకి డిసెంబర్ 12న రిలీజ్ చేయడానికి మేకర్స్ డిసైడయ్యారు. ఈ రోజు రాత్రి ప్రీమియర్ షోలు నడపడానికి కూడా ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో హైకోర్టు షాకివ్వడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






