‘మహావతార్ నరసింహా’ ఖాతాలో మరో సంచలన రికార్డు.. ఫుల్ ఖుషిలో చిత్రబృందం

by Kodari Anjali |

మహావతార్ నరసింహ జులై 25 న విడుదలైన భారతీయ యానిమేటెడ్ పౌరాణిక చిత్రం.

‘మహావతార్ నరసింహా’ ఖాతాలో మరో సంచలన రికార్డు.. ఫుల్ ఖుషిలో చిత్రబృందం
X

దిశ, వెబ్‌డెస్క్: మహావతార్ నరసింహ జులై 25 న విడుదలైన భారతీయ యానిమేటెడ్ పౌరాణిక చిత్రం. ఇది శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు, అతని కుమారుడు ప్రహ్లాదుడు.. అలాగే నరసింహ స్వామి కథను చూపిస్తారు.

రాక్షసుడు హిరణ్యకశిపుడు, విష్ణువును పూజించడం మానేసి, తనను తాను దేవుడిగా ప్రకటించుకుంటాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడిగా ఉంటాడు. ఇది తండ్రీకొడుకుల మధ్య ఘర్షణకు.. చివరకు, నరసింహావతారంలో విష్ణువు హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఇక ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా.. క్లీమ్ ప్రొడక్షన్స్, హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

అందరినీ విపరీతంగా ఆకట్టుకున్న ఈ యానిమేషన్ చిత్రం తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది. వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు మహావతార్ నరసింహా రూ. 210 కోట్లు వసూలు చేసినట్లు మూవీ టీమ్ తెలిపింది. ఈ విషయాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని యానిమేషన్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. అలాగే కంటెంట్ బాగుంటే జనాలు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని దర్శకుడు చెప్పుకొచ్చారు. యానిమేషన్ అంటే చిన్న పిల్లలకు సంబంధించిందని భావిస్తారని.. కానీ మేం ఆ మైండ్‌సెట్ ఛేంజ్ చేశామంటూ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story