Thandel: రుచికరమైనది అందించడానికి సిద్ధంగా ఉంది.. తండేల్ నుంచి మరో పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |

యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action entertainer) ‘తండేల్’

Thandel: రుచికరమైనది అందించడానికి సిద్ధంగా ఉంది.. తండేల్ నుంచి మరో పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ (Action entertainer) ‘తండేల్’ (Thandel). చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ (Allu Arvind) సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే మ్యూజిక్ ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే వచ్చిన సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై మరింత పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ (Positive expectations) క్రియేట్ అవుతున్నాయి.

ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రజెంట్ వరుస అప్‌డేట్స్‌తో సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా.. తాజాగా ‘తండేల్’ నుంచి మరో కొత్త పోస్టర్‌ (Poster)ను రిలీజ్ చేస్తూ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు ‘తండేల్ బృందం మీకు ప్రేమతో సముద్రం నుండి పెదవి విరిచేలా రుచికరమైనది అందించడానికి సిద్ధంగా ఉంది.. 17-01-2025 ఉదయం 11.07 గంటలకు రాబోతుంది.. చూస్తూనే ఉండండి’ అంటూ చెప్పుకొచ్చారు. రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఒక పొయ్యిపై మట్టి కుండ ఉండగా.. నాగచైతన్య ఏదో వండుతున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

Next Story