- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి థియేటర్లలో ‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్‌తో పాటు మరో ఆఫర్.. పోస్ట్ వైరల్
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప-2’(Pushpa-2) మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.

దిశ, సినిమా: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప-2’(Pushpa-2) మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఫస్ట్ షో నుంచి కలెక్షన్ల విషయంలో తగ్గేదేలే అంటూ భారీగా వసూళ్లు సాధించింది. అంతే కాకుండా ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇక వరల్డ్ వైడ్‌గా రూ.1832 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నేటి నుంచి థియేటర్లలో ‘పుష్ప-2’ రీలోడెడ్(Reloaded) వెర్షన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు మేకర్స్. పుష్ప-2 రిలీజ్ టైమ్‌లో ఎడిటింగ్‌లో తీసేసిన 20 నిమిషాల ఫుటేజ్‌ను ఈ రోజు నుండి యాడ్ చేస్తూ.. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్స్‌లో ఈ న్యూ వర్షన్‌ను ప్రదర్శించనున్నారు. మరో వైపు నేటి నుంచి ఈ సినిమా టికెట్ ధరలను కూడా తగ్గించారు మేకర్స్. నైజాంలో పుష్ప రీలోడెడ్ వర్షన్ టికెట్ ధర సింగిల్ స్క్రీన్‌లో రూ.112 గాను అండ్ మల్టీ ప్లెక్స్‌లో రూ.150 గానూ నిర్ణయిస్తూ అఫీషియల్‌గా ప్రకటించింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers). దీంతో సినీ ప్రేక్షకులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.






