- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Niharika Konidela: హిట్ కాంబో రీలోడ్.. ఆ దర్శకుడితో నిహారిక కొణిదెల మూడో చిత్రం
‘ఒక మనసు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

దిశ, సినిమా: ‘ఒక మనసు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ హీరోయిన్‌గా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక ఇటీవల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేసి నిర్మాతగా రాణిస్తుంది. తన బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.1గా వచ్చిన ‘కమిటి కుర్రోళ్లు’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ థియేట్రికల్‌గా దాదాపు రూ. 24 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.2గా నిహారిక నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు నిర్మాతగ తన మూడో చిత్రం కోసం నిహారిక సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కమిటి కుర్రోళ్లు కాంబో రిపీట్ అవుతున్నట్లు టాక్. యంగ్ డైరెక్టర్ యదు వంశీ మరోసారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెలతో కలిసి సినిమాను రూపొందించడానికి చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. అంతే కాకుండా.. ఈ మూవీ 2026లో సెట్స్‌పైకి వెళ్లనుందని గట్టిగా టాక్ నటుడుస్తుండగా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






