Rajinikanth:మరో సినిమా అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్? ఫుల్ ఖుష్‌లో ఫ్యాన్స్!

by Chukka Sudharani |   (  Updated:2025-05-17 15:53:44  IST  )

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) త్వరలో ‘కూలీ’ (Coolie) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Rajinikanth:మరో సినిమా అప్డేట్ ఇచ్చిన సూపర్ స్టార్? ఫుల్ ఖుష్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) త్వరలో ‘కూలీ’ (Coolie) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు-14న థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇందులో రజినీ గోల్డ్ స్మగ్లర్ (Gold Smuggler) పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుండగా.. ‘కూలీ’ చిత్రం కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా విడుదల కాకముందే సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ అందింది. రజినీకాంత్ తన నెక్ట్స్ మూవీకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం రజినీ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers)తో చేతులు కలిపినట్లు సమాచారం. అంతేకాకుండా.. తెలుగు యువ ప్రతిభావంతులైన వివేక్ ఆత్రేయ (Vivek Atreya) ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారని ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Next Story