- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో.. సినిమా పోస్టర్ రిలీజ్!
సూపర్ స్టార్ కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొంత కాలంలోనే మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి చాలా మంది సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ తరుణంలో సూపర్ స్టార్ కుమారుడు మహేష్ బాబు కూడా ఇండస్ట్రీకి పరిచయమై.. కొద్ది కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించారు.
ఇకపోతే.. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఎప్పుడు హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్‌కు పరియమవుతున్నారు. మహేష్ దివంగత సోదరుడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ వెండి తెరపైకి రానున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తిరుపతిలో జరిగే ఒక ప్రేమ కథ నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. అయితే.. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు కొడుకు వరస అయ్యే జయ కృష్ణ హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.
READ MORE .....
ఆర్ఎక్స్ 100 డైరెక్టర్‌తో సూపర్ స్టార్ మనవడు.. ఇట్స్ అఫీషియల్






