సుకుమార్ స్కూల్ నుంచి మరో దర్శకుడు.. ‘మావా’ టైటిల్‌తో యూత్‌ఫుల్ డ్రామా?

by Pulgam srinivas |

సుకుమార్ టీమ్‌లో కీలక సభ్యుడిగా పనిచేసిన ఏఆర్ ప్రభవ్ దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

సుకుమార్ స్కూల్ నుంచి మరో దర్శకుడు.. ‘మావా’ టైటిల్‌తో యూత్‌ఫుల్ డ్రామా?
X

దిశ, వెబ్ డెస్క్: తన దగ్గర పనిచేసే వారిని తీర్చిదిద్దడంలో టాలీవుడ్ దర్శకుల్లో సుకుమార్ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటివరకు ఆయన వద్ద పనిచేసిన ఎంతోమంది దర్శకులుగా ఎదిగి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ఆ లిస్టులోకి మరో పేరు చేరబోతున్నట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ టీమ్‌లో కీలక సభ్యుడిగా పనిచేసిన ఏఆర్ ప్రభవ్ దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారం ఏఆర్ ప్రభవ్ ఓ యూత్‌ఫుల్ డ్రామాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కొత్త హీరో ప్రేమ్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్ శిష్యుడు కావడంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సుకుమార్ దగ్గర పనిచేసిన పలువురు టెక్నీషియన్లు, దర్శకులు తమదైన శైలిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఈ చిత్రానికి “మావా” అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను కూడా త్వరలోనే మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది. సుకుమార్ స్కూల్ నుంచి వస్తున్న మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీలో ఏ స్థాయిలో గుర్తింపును దక్కించుకుంటాడో చూడాలి.

Next Story