- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ది ప్యారడైజ్’ నుంచి మరో క్రేజీ పోస్టర్ రిలీజ్.. ఆయన అన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొంటాడు అంటూ పోస్ట్
నేచురల్ స్టార్ నాని (Nani) ప్రజెంట్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise).

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని (Nani) ప్రజెంట్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఇక దీనికి శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇంతకు ముందు వీర కాంబోలో వచ్చిన ‘దసరా’(Dasara) ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఈ మూవీ 2026 సమ్మర్‌లో మార్చి26న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే.. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ చిత్రం నుంచి నిన్న మార్నింగ్ ఓ అప్డేట్ ఇచ్చి అభిమానులకు సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. అయితే సాయంత్రం మరో అప్‌డేట్ ఇస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో నానికి సంబంధించిన ఓ క్రేజీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నా జడల్ నాని అన్న.. అతని వైఖరి.. ప్రపంచం అతనికి వ్యతిరేకంగా ఉండవచ్చు అండ్ ప్రపంచం అంతం కావచ్చు. ఆయన అన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొంటాడు. ఆయన #TheParadise లో మరెవరూ లేని విధంగా లేస్తాడు’ అని రాసుకొస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో నాని మధ్యలో ఓ చైర్ వేసుకుని కూర్చొని ఉండగా.. అతని చుట్టూ చాలా మంది గుమిగూడి కత్తులతో, చేతులతో బెదిరిస్తున్నారు. అయితే వారందరిని నాని పట్టించుకోకుండా పైన చూస్తున్నాడు. ప్రస్తుతంఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Link






