మహానటికి బాలీవుడ్‌లో మరో చాన్స్.. ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్..

by I. Sairam |   (  Updated:2026-01-19 08:09:10  IST  )

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

మహానటికి బాలీవుడ్‌లో మరో చాన్స్.. ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) సినిమాలతో ఈ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్థన్ మూవీలో యాక్ట్ చేస్తోంది.

ఇక ఈ చిన్నదాని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తట్టిల్‌‌(Antony Thattil)ని ప్రేమించి ఏడాది క్రితం డిసెంబర్ 12న వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వేకేషన్స్‌కు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కీర్తి సురేశ్ కొంతకాలం క్రితం బేబీ జాన్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఆమె హిందీ డెబ్యూ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు.

ఈ క్రమంలో ఈ భామకు మరోసారి బాలీవుడ్ ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీర్తి సురేష్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో ‘తుపాకీ’ ఫేమ్ విద్యుత్ జమ్వాల్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందే ఈ సినిమాతో కీర్తి హిందీలో మంచి ఫేమ్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read More..

ప్రేమలో పడిన మృణాల్.. ముఖ్యమైన వార్త ప్రకటిస్తానంటూ షాకింగ్ పోస్ట్

Next Story