- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడిపోయిన మరో సెలబ్రిటీ జంట.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన మౌనీ రాయ్
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు మౌనీ రాయ్ , సూరజ్ నంబియార్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణుల్లో ఒకరైన మౌనీ రాయ్ దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకుంది. వివాహం అనంతరం చాలా కాలం పాటు వీరి దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగింది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై ఈ జంట క్లారిటీ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సంయుక్త ప్రకటన విడుదల చేసిన వీరు.. “మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం.
మా వ్యక్తిగత జీవితంపై అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దయచేసి వాటిని నమ్మొద్దు. మాకు ప్రైవసీ ఇవ్వండి” అని పేర్కొన్నారు. 2018 న్యూ ఇయర్ వేడుకల్లో తొలిసారి మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ కలుసుకున్నారు. మొదట్లో మౌనీ రాయ్ ఓ నటి అనే విషయం సూరజ్‌కు తెలియదట. అనంతరం తరచూ విదేశాల్లో కలుసుకుంటూ స్నేహాన్ని ప్రేమగా మార్చుకున్న ఈ జంట, కొంతకాలం డేటింగ్ అనంతరం 2022 జనవరి 27న గోవాలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.






