- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రిలో చేరిన మరో బాలీవుడ్ స్టార్ యాక్టర్
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ సీనియర్ నటులను ఆరోగ్య సమస్యలు వేదిస్తున్నాయి. దీంతో ఒక్కొక్కరుగా ఆస్పత్రి పాలు కావడం అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటుంది.

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా బాలీవుడ్ సీనియర్ నటులను (Senior Bollywood actors) ఆరోగ్య సమస్యలు వేదిస్తున్నాయి. దీంతో ఒక్కొక్కరుగా ఆస్పత్రి పాలు కావడం అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటుంది. కొద్ది రోజుల క్రితం ప్రముఖ నటుడు ధర్మేంద్ర (Dharmendra) ఆస్పత్రిలో చేరగా.. ఆయన మృతి చెందారనే ఫేక్ వార్తలు వైరల్ అయ్యాయి. వాటిపై కుమార్తు, భార్య స్పందించి.. ధర్మేంద్ర ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, చికిత్సకు కోలుకుంటున్నాడని ప్రకటించిన విషయం తెలిసిందే.
దీని నుంచి తేరుకోక ముందే.. మరో బాలీవుడ్ నటుడు గోవిందా (Govinda) ఈ రోజు ఆస్పత్రిలో చేరారు. ఆయన ముంబై-జుహులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేసినట్లు వార్తలు వచ్చాయి. మంగళవారం అర్ధరాత్రి ఉన్నట్టుండి స్పృహ కోల్పోయి కింద పడిపోవడంతో.. చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్లు గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం గోవిందా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం అందుతుండగా.. కుటుంబ సభ్యులు కానీ డాక్టర్లు కానీ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.






