పెద్ది’ ట్రైలర్‌పై మరో బిగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సర్‌ప్రైజ్

by Pulgam srinivas |

ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు 'పెద్ది' ట్రైలర్ సందడి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

పెద్ది’ ట్రైలర్‌పై మరో బిగ్ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సర్‌ప్రైజ్
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రైలర్ విడుదలకు సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ‘పెద్ది’ ట్రైలర్ టేకోవర్ ఈవెంట్ ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 4:05 గంటలకు ట్రైలర్ సందడి ప్రారంభం కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, అదే సమయానికి ట్రైలర్‌ను విడుదల చేస్తారా? లేదా కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రదర్శించిన తర్వాత విడుదల చేస్తారా? అనే విషయంపై చిత్ర బృందం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో ట్రైలర్ ఈవెంట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనుండగా, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు.




Next Story