Nayanatara : నయన్ కు మరో బిగ్ షాక్

by Muthe.Rajitha |

నయనతార(Nayanatara)కు మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో భారీ షాక్ తగిలింది.

Nayanatara : నయన్ కు మరో బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : నయనతార(Nayanatara)కు మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో భారీ షాక్ తగిలింది. గతేడాది ఇండస్ట్రీ టాక్ గా నిలిచిన నయన్ వివాహ డాక్యుమెంటరీ.. అంతే వివాదాస్పదం అయింది. గత నవంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో రిలీజైన నయనతార: బియాండ్ ది ఫెయిర్ టేల్ డాక్యుమెంటరీ(Nayanatara: Beyond The Fairy Tale Documentary)లో తన అనుమతి లేకుండా.. 'నేను రౌడీనే'(Nenu Rowdy ne) సినిమా విజువల్స్‌ను వాడుకున్నందుకు.. ధనుష్ (Dhanush)నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్(Rowdy Picturs) పై కేసు పెట్టాడు. ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లోని నేను రౌడీనే సినిమాకు సంబంధించిన 3 సెకన్ల సన్నివేశాన్ని ఉపయోగించారని, తన అనుమతి లేకుండా వాడిన సీన్‌ను 24 గంటల్లోగా తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ధనుష్ హెచ్చరించాడు.

అయితే దీనిపై అటు నయనతార కానీ, ఇటు విఘ్నేష్ శివన్(Vighnesh Shivan) కానీ స్పందించలేదు. దాంతో ధనుష్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాడు. ధనుష్ నష్ట పరిహారంగా 10 కోట్లు కోరుతు నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై నయనతార కూడా స్పందించి.. ధనుష్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అది తెగ వైరల్ అయిపోయింది. అంతేకాకుండా ధనుష్ తమపై వేసిన కాపీరైట్ దావాను తిరస్కరించాలంటూ మద్రాస్ హైకోర్టును నెట్‌ఫ్లిక్స్ సంస్థ కోరింది. అయితే తాజాగా ఆ పిటీషన్‌ను తాజాగా మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. 2015లో రిలీజైన నేను రౌడీనే సినిమా కమర్షియల్‌గా భారీగా హిట్టవలేదు కానీ.. మంచి రివ్యూస్ మాత్రం తెచ్చుకుంది. ఈ సినిమాతోనే విఘ్నేష్ శివన్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో నయన్‌ తార హీరోయిన్‌గా నటించింది. కోర్ట్ నిర్ణయంపై ఇటు నయన్ గాని, ధనుష్ గాని ఇంకా స్పందించలేదు.

Next Story