- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శార్వరి ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్.. విడుదల తేదీతో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!
ఓ క్రేజీ యాక్షన్ రోమాంటిక్ చిత్రంలో శార్వరి హీరోయిన్‌గా కనిపించబోతుండటం విశేషం. టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్‌లో వరుస హిట్లు, విభిన్న పాత్రలతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ శార్వరి వాఘ్ ఇటీవల ఆల్ఫా, మెయిన్ వాపర్ ఆవుంగా వంటి చిత్రాలతో మెప్పించారు. అంతేకాకుండా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శార్వరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ఖాతాలో మరో భారీ ప్రాజెక్ట్ చేరింది. 'సుల్తాన్', 'టైగర్ జిందా హై' లాంటి భారీ బ్లాక్‌బస్టర్లు తీసిన ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో రాబోతున్న ఓ క్రేజీ యాక్షన్ రోమాంటిక్ చిత్రంలో శార్వరి హీరోయిన్‌గా కనిపించబోతుండటం విశేషం. టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో శార్వరి విభిన్నమైన రోల్‌లో కనిపించబోతున్నట్లు టాక్. ప్రేమకథతో పాటు అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా కీలకమని, ఆమె చేసే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో ‘సైయారా’ ఫేమ్ అహాన్ పాండే హీరోగా నటిస్తున్నారు. వర్సటైల్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనుండగా.. ఐశ్వర్య థాకరే విలన్‌గా నటిస్తున్నారు.. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో శార్వరి భాగం కావడం ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. తాజాగా, ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని వెల్లడించారు. ఈ చిత్రాన్ని 2027 మార్చి 26న గుడ్ ఫ్రైడే కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.






