- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరంజీవి గారి షూటింగ్ అంటే అక్కడ అది కంపల్సరీ.. నాకు స్పెషల్ ప్రిఫరెన్స్ ఉండేది... అన్నపూర్ణమ్మ
అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ... చిరంజీవి గారి సినిమా షూటింగ్ ప్రాంతంలో నాన్ వెజ్ పెద్ద మొత్తంలో ఉండేది. ఆయన మీద అభిమానంతో ఎంతోమంది నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకువచ్చి ఇచ్చేవారు అని చెప్పుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో అన్నపూర్ణమ్మ గారు ఒకరు. ఈమె చాలా సంవత్సరాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. ఎంతో మంది స్టార్ హీరోలకు తల్లి పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ మధ్యకాలంలో ఈమె సినిమాల్లో అమ్మమ్మ, నాన్నమ్మ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా అన్నపూర్ణమ్మ గారు సుహాస్ హీరోగా, శివానీ నాగారం హీరోయిన్గా రూపొందిన హే బల్‌వంత్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు.
ఇందులో సుదర్శన్, అన్నపూర్ణమ్మ, నరేష్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో సుహాస్, శివానీ నాగారం, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ నలుగురు కలిసి భోంచేస్తూ అనేక విషయాలను మాట్లాడుకున్నారు. అందులో భాగంగా సుదర్శన్ అన్నపూర్ణ గారిని భోజనం చేస్తున్న సమయంలో మీరు కొన్ని సంవత్సరాల క్రితం నాన్ వెజ్ బాగా తినేవారా అని అడుగుతాడు.
దానితో అన్నపూర్ణ స్పందిస్తూ... నేను కొన్ని సంవత్సరాల క్రితం బాగా నాన్ వెజ్ తినేదాన్ని, ముఖ్యంగా చిరంజీవి గారి సినిమా షూటింగ్ ప్రదేశంలో మాత్రం నాన్ వెజ్ లేకుంటే నడిచేదే కాదు అన్నారు. దానితో సుదర్శన్, చిరంజీవి గారు నాన్ వెజ్ బాగా తింటారా అని అడుగుతాడు. దానికి అన్నపూర్ణమ్మ... చిరంజీవి గారు ఎక్కువగా తినరు, కాకపోతే ఆయన మీద అభిమానంతో ఎంతోమంది బయటి ఊర్ల నుండి నాన్ వెజ్ వంటకాలు తెచ్చి ఇచ్చేవారు. లంచ్ టైంలో ఆయన ప్రత్యేకంగా నాకు ఆ నాన్ వెజ్ ఐటమ్స్ పంపించేవారు అని అన్నపూర్ణమ్మ తెలియజేశారు.






