- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ హీరోస్ మూవీ అన్నగారు
‘అన్నగారు వస్తారు’ ఓ ఛాలెంజింగ్ ఫిల్మ్ అని తెలిపాడు హీరో కార్తి. రైటర్స్‌కు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయన్న ఆయన.. ‘అవేంజర్స్’ లాంటి విజువల్స్, మ్యూజిక్‌తో ఈ చిత్రాన్ని నలన్ కుమార స్వామి కొత్తగా ప్రెజెంట్ చేశాడని తెలిపాడు. ఈ నెల 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ కాగా

దిశ, సినిమా : ‘అన్నగారు వస్తారు’ ఓ ఛాలెంజింగ్ ఫిల్మ్ అని తెలిపాడు హీరో కార్తి. రైటర్స్‌కు స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయన్న ఆయన.. ‘అవేంజర్స్’ లాంటి విజువల్స్, మ్యూజిక్‌తో ఈ చిత్రాన్ని నలన్ కుమార స్వామి కొత్తగా ప్రెజెంట్ చేశాడని తెలిపాడు. ఈ నెల 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ కాగా.. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ప్రమోషన్స్‌లో పాల్గొన్న కార్తి.. ‘నేను ఈ సినిమాలో నటించేందుకు కారణం డైరెక్టర్ నలన్ కుమారస్వామి. ఆయన ‘సూదు కవ్వమ్’ సినిమాకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన డైరెక్టర్స్ అంతా ఆ మూవీ గురించి చెప్పారు. అలాంటి డైరెక్టర్ ఎనిమిదేళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమాలు చేయకుంటే వాళ్లను మర్చిపోతాం. కానీ నలన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మనం సూపర్ హీరో అంటే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ అనే అనుకుంటాం కానీ మన కల్చర్‌లోనూ ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటి సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్లు మన సినిమాను, పాలిటిక్స్‌ను మార్చేశారు. అలాంటి సూపర్ హీరో తిరిగి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో 80వ దశకంలో మాస్ కమర్షియల్ సినిమా మేనియాను మరోసారి గుర్తుచేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ మూవీ స్టోరీ ఒక కాల్పనిక ప్రపంచంలో జరుగుతుంటుంది’ అని తెలిపాడు. ఇది పారలల్ వరల్డ్‌లో జరిగే సూపర్ హీరో సినిమా అని.. గతంలో సీరియస్, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ క్యారెక్టర్స్ చేశాను కానీ ఇందులో పోలీస్ పాత్రను దర్శకుడు డిఫరెంట్‌గా డిజైన్ చేశాడని చెప్పాడు కార్తి. నలన్ మాతో చెప్పించే డైలాగ్స్ కూడా ఒక రిథమ్‌తో ఉంటాయని.. మ్యూజిక్ కూడా కొత్తగా చేయిస్తాడని తెలిపాడు.






