అన్నగారు వస్తారు Movie | నేడే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

by Thanuru Gopichand |

స్టార్ హీరో కార్తి నటించిన తాజా చిత్రం 'అన్నగారు వస్తారు' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నేడు (డిసెంబర్ 9) గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

అన్నగారు వస్తారు Movie | నేడే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
X

దిశ, వెబ్ డెస్క్ : స్టార్ హీరో కార్తి నటించిన తాజా చిత్రం 'అన్నగారు వస్తారు' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నేడు (డిసెంబర్ 9) గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ హయాత్‌ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక కానుంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకకు అభిమానులు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. నలన్ కుమారసామి దర్శకత్వంలో, సంతోష్ నారాయణన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ పాస్‌లను shreyas.media/av ద్వారా బుక్ చేసుకోవచ్చని చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన లభించగా, కార్తి ఇందులో ఒక చలాకీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో, సీనియర్ ఎన్టీఆర్ అభిమాని గెటప్‌లో కనిపిస్తుండటం ప్రేక్షకులలో ఆసక్తిని మరింత పెంచింది.

​డిసెంబర్ 12న విడుదల

కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కె.ఇ. జ్ఞానవేల్ రాజా 'స్టూడియో గ్రీన్' పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో సత్యరాజ్, ఆనంద్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. పక్కా కమర్షియల్ హంగులతో రూపొందించబడిన 'అన్నగారు వస్తారు' ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో విడుదలకు మరింత ఉత్సాహాన్ని తీసుకురానుంది. ఈ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Next Story