Anjana Devi: మా నాన్నను కలిసినట్లు ఉంటుంది.. మొగలిరేకులు హీరోపై అంజనాదేవి కామెంట్స్

by Chukka Sudharani |

మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది 100’.

Anjana Devi: మా నాన్నను కలిసినట్లు ఉంటుంది.. మొగలిరేకులు హీరోపై అంజనాదేవి కామెంట్స్
X

దిశ, సినిమా: మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఆర్కే సాగర్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ధన్య బాలకృష్ణ, మిషా నారంగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ‘ది 100’ చిత్రం జూలై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న చిత్ర బృందం.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవిని కలుసుకున్నారు.

అయితే.. ‘మొగలిరేకులు’ సినిమా నుంచి ఆర్కే సాగర్‌కి అంజనాదేవి అభిమాని అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై అభిమానాన్ని మాటల్లో మరోసారి చెప్పుకొచ్చారు అంజనాదేవి. ‘నాకు మొగలిరేకులు నుంచి గుర్తిండిపోయాడు. మా నాన్న గారి పేరు కూడా ఆర్కే నాయుడు. అందుకే ఆ పేరుకు నేను అలా కనెక్ట్ అయ్యా. చాలా నెమ్మదస్తుడు. చాలా సంతోషంగా ఉంది కలవడం.. మా నాన్నను కలిసినట్లు ఉంటుంది. అసలు ఆర్కే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లాలి.. నువ్వు అనవసరంగా సినిమా ఫీల్డ్‌కు వచ్చావు’ అని చెప్పుకొచ్చారు. దీంతో.. ఆర్కే నవ్వుతూ.. ‘పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి వస్తే మిమ్మల్ని కలిసేవాడిని కాదు.. మిమ్మల్ని కలవడానికే ఇటు రావాల్సి వచ్చింది’ అని తెలిపాడు. దీంతో సినిమా చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చారు అంజనాదేవి. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.Link

Next Story