Anjana Devi: మెగా కుటుంబంలో ఆందోళన.. చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత?

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-21 05:17:42  IST  )

మెగాస్టార్ కొణిదల చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది.

Anjana Devi: మెగా కుటుంబంలో ఆందోళన.. చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తల్లి అంజనా దేవి (Anjana Devi) అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆమెను చికిత్స నిమిత్తం ఇవాళ తెల్లవారుజామున ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan) ఇవాళ విజయవాడ (Vijayawada)లో పాల్గొనాల్సిన పలు కార్యక్రమాలు, అధికారులతో సమీక్షలను వాయిదా వేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌ (Hyderabad)కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే, కొణిదెల అంజనా దేవి (Anjana Devi)కి ఐదుగురు సంతానం. వారే చిరంజీవి (Chiranjeevi), నాగబాబు (Nagababu), పవన్ కళ్యాణ్‌ (Pavan Kalyan), విజయలక్ష్మి (Vijaya Lakshmi), మాధవి (Madhavi). కాగా, ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అమ్మ అంజనా దేవి పుట్టిన రోజును కుటుంబ సభ్యుల సమక్షంలో అట్టహాసంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియా (Social Media) ప్లాట్ ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా షేర్ చేస్తూ అమ్మ అంజనా దేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Next Story