- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పలుచటి బ్లాక్ శారీలో కొంటె చూపులతో కవ్విస్తున్న అంజలి రావు
పలుచటి శారీలో అందాల విందు చేసిన అంజలి రావు.. చూపులతోనే ఫిదా.

దిశ, వెబ్ డెస్క్: అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హాట్ బ్యూటీ అంజలి రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటి, డాన్సర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రం ‘సూదు కవ్వుం’తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
అనంతరం నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో టాలీవుడ్‌లో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు.
అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అంజలి రావు ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజాగా ఈ భామ ఉల్లిపొరలాంటి పలుచటి బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయింది. అలాగే మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి తన గ్లామర్‌తో చూపరులను కట్టిపడేసింది.
ముఖ్యంగా షార్ట్ హెయిర్ స్టైల్‌తో మరింత స్టైలిష్‌గా కనిపించిన అంజలి, తన మత్తెక్కించే చూపులతో అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ అందాల భామ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల నుంచి భారీగా ప్రశంసలు అందుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






