తల్లి కాబోతున్న అంజలి.. 2.0 వచ్చేస్తోందంటూ ఆసక్తికర వీడియో షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

బుల్లితెర నటి అంజలి(Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు సీరియల్స్‌లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

తల్లి కాబోతున్న అంజలి..  2.0 వచ్చేస్తోందంటూ  ఆసక్తికర వీడియో షేర్ చేయడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బుల్లితెర నటి అంజలి(Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు సీరియల్స్‌లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ప్రేక్షకుల్లో వీపరీలమైన ఆదరణ పొందిన ‘మొగలిరేకులు’ (Mogali Rekulu)సీరియల్‌లో అంజలి కీలక పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్శించింది. ఆ తర్వాత పలు సీరియల్స్, షోస్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే అంజలి, పవన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత బుల్లితెరకు దూరం అయింది. అయితే ఈ జంటగా ఒక పాప కూడా ఉంది. ఇక అంజలి కూతురు పుట్టిన తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. పలు షోస్‌లో పాల్గొనడంతో పాటు నిత్యం తన కూతురితో ఫొటోషూట్లు చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతోంది. తన కూతురు, భర్తతో కలిసి చేసిన వీడియోలను నెట్టింట పెడుతున్న ఆమె ఎంతోమంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఇంట్లోనే ఉంటూ చేతినిండా సంపాదిస్తోంది.

తాజాగా, అంజలి తల్లి కాబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ వ్లాగ్ కూడా చేసింది. ముందుగా కూతురికి గుడ్ న్యూస్ చెప్పిన ఆమె ఆ తర్వాత భర్తకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సంతోష్ పవన్(Santosh Pawan) ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో పెట్టడంతో సినీ సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అంజలి ఫ్యామిలీతో కలిసి ట్రెండింగ్‌లో జిబ్లీ ఆర్ట్‌ను ట్రై చేసింది. కూతురు, భర్తతో నిల్చొని ఉండగా.. ఓ చిన్న బాబు కూడా రావడంతో అంతా షాక్ అయినట్లు చేస్తారు. చివరకు కూతురితో బేబీ రాబోతున్నట్లు చెప్పించారు. ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేస్తూ 2.0 రాబోతున్నాడంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Next Story